దిల్లీకి జనసేన అధినేత పవన్‌
close

తాజా వార్తలు

Updated : 11/01/2020 13:26 IST

దిల్లీకి జనసేన అధినేత పవన్‌

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హస్తినకు పయనమయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుండగా మధ్యలోనే అయన దిల్లీ బయల్దేరారు. కేంద్ర ప్రభుత్వ ప్రముఖులతో సమావేశమయ్యేందుకు ఆయనకు అపాయింట్‌మెంట్‌ ఖరారైనట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి.

రాజధాని రైతుల ఆందోళనలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిచేందుకు పార్టీ ముఖ్యనేతలతో పవన్‌ కల్యాణ్‌ ఇవాళ సమావేశమయ్యారు. సమావేశం కొనసాగుతుండగానే..హస్తిన పర్యటనకు సంబంధించిన సమాచారమందింది. దీంతో ఆయన హుటాహుటిన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి దిల్లీ బయల్దేరారు. నిన్న సాయంత్రం అమరావతి రైతులతో సమావేశం సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అంశానికి సంబంధించి ఏర్పడ్డ అనిశ్చిత పరిస్థితులను కేంద్రమే తొలగించాలని డిమాండ్‌ చేశారు. శాసనసభలో రాజధానిపై తీర్మానం చేయడం కన్నా ముందే కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. ఈనేపథ్యంలోనే రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో సమావేశమయ్యేందుకు పవన్‌ దిల్లీ వెళ్లారని తెలుస్తోంది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతో పాటు ఇతర ముఖ్య నేతలలో ఎవరితో పవన్‌ భేటీ అవుతారనే అంశంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని