ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

తాజా వార్తలు

Published : 16/01/2020 04:28 IST

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

హైదరాబాద్‌‌: రాష్ట్రంలోని 120 పురపాలికలు, 9 నగర పాలిక సంస్థల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. సాయంత్రం ఎన్నికల బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. ఈ నెల 22న పోలింగ్‌, 25న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మరోవైపు రాజకీయ పార్టీల తరఫున అభ్యర్థులకు అధికారికంగా బీ-ఫారాలు అందజేసే గడువు కూడా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. కరీంనగర్‌లో ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఆదేశాలతో అక్కడ ఆలస్యంగా నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. కరీంనగర్‌ నగరపాలక సంస్థలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 16తో ముగియనుంది. ఈ నెల 25న పోలింగ్‌, 27న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఖరారైన పోలింగ్ కేంద్రాల సంఖ్య
పురపాలక ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాల సంఖ్య ఖరారైంది. ఈ మేరకు పోలింగ్ కేంద్రాల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పది నగరపాలక సంస్థల్లోని 385 వార్డులకు గాను 1,786 పోలింగ్ కేంద్రాలున్నాయి. నిజామాబాద్ నగర పాలకసంస్థలో అత్యధికంగా 411 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్‌లో 348, రామగుండంలో 242 పోలింగ్ కేంద్రాలున్నాయి. తక్కువ సంఖ్యలో బండ్లగూడ జాగీర్‌లో 85 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 120 పురపాలక సంస్థల్లోని 2,727 వార్డులకు గాను 6,325 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. పురపాలికల్లో అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 240, ఆదిలాబాద్‌లో 183, నల్లగొండలో 180, సూర్యాపేటలో 146, మిర్యాలగూడలో 144 పోలింగ్ కేంద్రాలున్నాయి. డోర్నకల్, వర్ధన్నపేట, కొత్తపల్లి, ధర్మపురిలో 15 చొప్పున పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని