బెదిరింపులకు దిగితే సహించేది లేదు: లక్ష్మణ్‌

తాజా వార్తలు

Updated : 17/01/2020 12:32 IST

బెదిరింపులకు దిగితే సహించేది లేదు: లక్ష్మణ్‌

భూత్పూర్‌:  తెరాస నేతలు బెదిరింపులకు దిగితే సహించేది లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. భాజపా ఎన్నికల ప్రచారానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. శుక్రవారం భూత్పూర్‌ పురపాలిక ఎన్నికల ప్రచారంలో లక్ష్మణ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వం మాటలకే పరిమితమైపోయిందని విమర్శించారు. తెరాస పార్టీ అన్ని విషయాల్లోనూ ఎంఐఎంను వెనకేసుకొస్తోందన్నారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ, రైతుబంధు పథకాలు అమలుకావడం లేదని చెప్పారు. ఈ ప్రచారంలో భాజపా నేతలు డీకే అరుణ, జితేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని