రాష్ట్రంలో మజ్లిస్‌ది పరిమిత పాత్ర:తలసాని

తాజా వార్తలు

Updated : 18/01/2020 16:26 IST

రాష్ట్రంలో మజ్లిస్‌ది పరిమిత పాత్ర:తలసాని

హైదరాబాద్‌: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా ద్వారా ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో తలసాని మీడియాతో మాట్లాడారు. తాండూరు మున్సిపాలిటీని ఎంఐఎం పార్టీకి ఇచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని.. అలా చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. మజ్లిస్‌ పార్టీతో తెరాసకు అవగాహన మాత్రమే ఉందని.. రాష్ట్రంలో ఆ పార్టీది పరిమితమైన పాత్ర మాత్రమేనని తలసాని స్పష్టం చేశారు. ఎంఐఎం పోటీ చేసిన చోట భాజపా ఎందుకు పోటీ చేయడంలేదని మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్, భాజపాలకు చెప్పుకోవడానికి ఏం లేవని.. పురపోరులో ఆ రెండు పార్టీలు పూర్తిస్థాయిలో అన్ని స్థానాల్లో అభ్యర్థులను ఎందుకు నిలబెట్టలేకపోయాయని ప్రశ్నించారు.

నగరపాలికలు, మున్సిపాలిటీల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోందని.. తెరాసకు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అధికారంలో ఉన్నట్లుగా భావించి కాంగ్రెస్‌ మేనిఫెస్టోను తయారు చేసిందని మంత్రి ఎద్దేవా చేశారు. తెరాస అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే పట్టం కడతాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని