90 శాతం తెరాసవే: పల్లా

తాజా వార్తలు

Updated : 22/01/2020 19:33 IST

90 శాతం తెరాసవే: పల్లా

హైదరాబాద్‌: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం సీట్లు తెరాస కైవసం చేసుకుంటుందని తెరాస ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి ఛైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల నాడి పసిగట్టడం.. సరైన అభ్యర్థులను ఎంచుకోవడంలో ప్రతిపక్షాలు మరోసారి విఫలమయ్యాయని రాజేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓటర్లు తెరాసకు మద్దతుగా నిలిచారని అయన పేర్కొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ తెరాస ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. అభ్యర్థుల విజయం కోసం శ్రమించిన తెరాస కార్యకర్తలకు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని