ఓటమిని హుందాగా అంగీకరించాలి: పల్లా

తాజా వార్తలు

Updated : 24/01/2020 18:10 IST

ఓటమిని హుందాగా అంగీకరించాలి: పల్లా

హైదరాబాద్: మున్సిపల్‌ ఎన్నికల్లో తెరాస విజయఢంకా మోగించటం ఖాయమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఫలితాలు ప్రతిపక్షాలకు కనువిప్పు అవుతాయన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఈవీఎంలతో జరిగినా బ్యాలెట్‌ పేపర్‌తో జరిగినా తెరాసదే విజయమని అన్నారు. భాజపాకి ఈ ఎన్నికల్లో మతం తప్ప మరో అంశం దొరకలేదని.. అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టుకోలేకపోయిందంటూ పల్లా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి‌, భట్టి విక్రమార్క నియోజకవర్గాల్లోనూ తెరాస విజయం సాధించడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్‌ మీద ప్రజలకు విశ్వాసం ఉండబట్టే పార్టీ అన్ని ఎన్నికల్లో విజయం సాధిస్తోందని వివరించారు. కాంగ్రెస్‌, భాజపాలకు క్యాంపు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదని పల్లా విమర్శించారు. ఓటమిని ప్రతిపక్షాలు హుందాగా అంగీకరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే తెరాసకు మంచి ఆదరణ లభిస్తోందని పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని