పురపోరు.. కారు జోరు

తాజా వార్తలు

Updated : 25/01/2020 16:58 IST

పురపోరు.. కారు జోరు

పురపాలక, నగరపాలక సంస్థల ఫలితాల్లో తెరాస ఆధిక్యం
భాజపా, కాంగ్రెస్‌ పోటీ అంతంతే.. పలు చోట్ల స్వతంత్రుల హవా

హైదరాబాద్‌: పురపాలక, నగర పాలక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార తెరాస దూసుకెళుతోంది. ఆ పార్టీ అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థులు కొన్ని స్థానాలకే పరిమితమయ్యారు. స్వతంత్రులు చాలా చోట్ల సత్తా చాటారు. మొత్తం 120 పురపాలక సంస్థలు, 9 నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. 2,647 వార్డు సభ్యులు, 324 మంది కార్పొరేటర్లు ఎన్నికవ్వాల్సి ఉండగా.. మెజారిటీ స్థానాల్లో తెరాస సభ్యులే గెలుపొందారు. 80 వార్డులు, 1 డివిజన్‌ ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి.

120 పురపాలికల్లో మొత్తం 107 చోట్ల తెరాస విజయకేతనం ఎగరవేసింది. ఐజా, కొల్లాపూర్‌ మున్సిపాలిటీల్లో ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరఫున తెరాస రెబల్స్‌ బరిలోకి దిగి ఆ రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నారు. ఇవి కూడా అధికార పార్టీ ఖాతాలో చేరే అవకాశం ఉంది. తెరాస మిత్రపక్షమైన మజ్లిస్‌ భైంసా, జల్పల్లి మున్సిపాలిటీల్లో విజయ ఢంకా మోగించింది. ఎక్స్‌అఫీషియో ఓట్లతో ఒకటి రెండు మున్సిపాలిటీల్లో తెరాస కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఏడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ విజయం సాధించగా.. ఆమన్‌గల్‌, తుక్కుగూడ మున్సిపాలిటీలు భాజపా వశమయ్యాయి. అటు కార్పొరేషన్లలోనూ తెరాస ఆధిపత్యం కొనసాగుతోంది. మొత్తం 9 నగరపాలక సంస్థల్లో 325 డివిజన్లకు గానూ.. 266 డివిజన్లలో ఫలితాలు వెలువడ్డాయి. 130 డివిజన్లలో తెరాస విజయ ఢంకా మోగించగా.. కాంగ్రెస్‌ 37, భాజపా 48, ఎంఐఎం 10 స్థానాల్లో గెలుపొందారు. 42 డివిజన్లలో స్వతంత్రులు విజయం సాధించారు.

ఫలితాల పట్టిక కోసం క్లిక్‌ చేయండి..
పుర ఫలితాలు లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి..

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని