అప్పుడే ఆ దారి తెరుచుకుంటుంది: కేజ్రీవాల్‌

తాజా వార్తలు

Updated : 27/01/2020 15:57 IST

అప్పుడే ఆ దారి తెరుచుకుంటుంది: కేజ్రీవాల్‌

దిల్లీ: భారతీయ జనతా పార్టీపై ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్ర విమర్శలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై దిల్లీలోని షహీన్‌బాగ్‌లో జరుగుతున్న ఆందోళనలను రాజకీయానికి ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ఎన్నికలయ్యేంత వరకు ఆ రహదారిని వారు తెరవబోరన్నారు. ఒకసారి ఎన్నికలు పూర్తయ్యాక ఆ రోడ్లు తెరుచుకుంటాయని వ్యాఖ్యానించారు. దేశ రాజధానిలో శాంతిభద్రతల విషయంలో కేంద్రం అబద్ధాలు చెబుతోందన్నారు. ఈ మేరకు సోమవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు.

శాంతి భద్రతల విషయంలో ఒకవేళ తన అనుమతే కావాల్సి వస్తే ఇప్పుడే అనుమతిస్తున్నా.. గంటలో ఆ రహదారిని ఖాళీ చేయండని కేజ్రీవాల్‌ అన్నారు. ‘‘షహీన్‌బాగ్‌ రోడ్డును ఫిబ్రవరి 8 వరకు (ఎన్నికల పోలింగ్‌) మూసి వేస్తారు. ఫిబ్రవరి 9న అదే తెరుచుకుంటుంది. కావాలంటే నేను రాసిస్తా. భాజపా కావాలనే ఆ రహదారిని తెరవాలని అనుకోవడం లేదు’’ అని కేజ్రీవాల్‌ అన్నారు. దేన్నైనా రాజకీయానికి ఉపయోగించుకోవడం ఎలానో భాజపాకు బాగా తెలుసని విమర్శలు గుప్పించారు. సీఏఏని వ్యతిరేకిస్తూ షహీన్‌బాగ్‌లో మహిళలు నెల రోజులకు పైగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. నిరసన ప్రాంతంలోనే నిన్న గణతంత్ర వేడుకలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో అమిత్‌షా ఆదివారం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. దిల్లీ ప్రజలు భాజపాకు ఓటు వేయాలని, తద్వారా ఇలాంటి వేలాది షహీన్‌బాగ్‌ ఘటనలను ఆపవచ్చని వ్యాఖ్యానించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని