నేరేడుచర్ల పురపాలిక తెరాస వశం

తాజా వార్తలు

Updated : 28/01/2020 13:45 IST

నేరేడుచర్ల పురపాలిక తెరాస వశం

నేరేడుచర్ల: తీవ్ర ఉద్రిక్తతలు, ఆద్యంతం రసవత్తరంగా మారిన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పురపాలక ఛైర్మన్‌ పీఠాన్ని ఎట్టకేటలకు తెరాస కైవసం చేసుకుంది. ఛైర్మన్‌గా జయబాబు, వైస్‌ ఛైర్‌పర్సన్‌గా శ్రీలత ఎన్నికయ్యారు. అధికార తెరాస, విపక్ష కాంగ్రెస్‌ మధ్య ఆధిపత్యపోరుకు నేరేడుచర్ల వేదికైంది. ఇరుపార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ అడ్డాలో ఎలాగైనా తన పాగా వేయాలనే పట్టుదలతో గులాబీ పార్టీ ఉండగా.. దానిని అడ్డుకోవడానికి కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రయత్నించడం ఆద్యంతం ఆసక్తిని రేపింది.

అంతకుముందు నాటకీయ పరిణామాల నడుమ పురపాలక సమావేశం జరిగింది. కొత్తగా ఎన్నికైన పురపాలక సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో కాంగ్రెస్‌ వాకౌట్‌ చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఎక్స్‌ అఫిషియో ఓట్ల జాబితాను మళ్లీ మార్చడం.. తాజాగా షేరి సుభాష్‌రెడ్డి, వెంకటేశ్వరుల పేర్లు చేర్చడాన్ని ఉత్తమ్‌ తీవ్రంగా తప్పుబట్టారు. అక్రమంగా నేరేడుచర్ల ఛైర్మన్‌ పదవిని దక్కించుకోవాలని అధికారపార్టీ చూస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన వార్డు సభ్యులతోపాటు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని