ఆ ఆటో డ్రైవర్లకు భారీ చలాన్లా?: కేజ్రీవాల్‌

తాజా వార్తలు

Published : 28/01/2020 22:30 IST

ఆ ఆటో డ్రైవర్లకు భారీ చలాన్లా?: కేజ్రీవాల్‌

దిల్లీ: దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో తమను ఓడించడమే లక్ష్యంగా భాజపా దిల్లీ ఎన్నికల ప్రచారానికి బయటివాళ్లను తీసుకొస్తోందని ఆప్‌ కన్వీనర్‌, సీఎం కేజ్రీవాల్‌ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారానికి బయటివాళ్లను తీసుకురావడం ద్వారా దిల్లీ ప్రజలను అవమానిస్తోందని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఆప్‌ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 8న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం భాజపా 200 మంది ఎంపీలు, 70 మంది మంత్రులు, 11 మంది ముఖ్యమంత్రులను బయటి నుంచి తీసుకొస్తోందని విమర్శించారు. దిల్లీ ప్రజల నుంచి భాజపాకు మద్దతు కొరవడటం వల్లే ఇలా బయటివారిని తీసుకొస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. దిల్లీ ప్రజలను ఓడించేందుకే వాళ్లు వస్తున్నారన్నారు. ‘‘మీ కొడుకు(కేజ్రీవాల్‌)ని ఓడించేందుకు వాళ్లు వస్తున్నారు. మనందరినీ అవమానించేందుకు వస్తున్నారు. వాళ్లొచ్చి మీ పాఠశాలల పరిస్థితి బాగాలేదంటారు. మీ మొహల్లా క్లీనిక్‌లు కూడా బాగాలేవని చెబుతారు. అప్పుడు మీరు నిశ్శబ్ధంగా ఉంటారా?’’ అని కేజ్రీవాల్‌ అడగ్గా.. లేదు అంటూ పెద్ద ఎత్తున ప్రజలు స్పందించారు.

ఆ ఆటో డ్రైవర్లపై భారీ చలాన్లా?

తమ వాహనాలపై ఐ లవ్‌యూ కేజ్రీవాల్‌ అని రాసుకున్న ఆటోడ్రైవర్లను భాజపా లక్ష్యంగా చేసుకొని వారికి భారీగా చలాన్లు వేయిస్తోందని కేజ్రీవాల్‌ మండిపడ్డారు. ఓ ఆటో డ్రైవర్‌కు రూ.10వేలు జరిమానా విధించినట్టు వచ్చిన మీడియా కథనాన్ని ప్రస్తావిస్తూ మంగళవారం ట్వీట్‌ చేశారు. పేదలను లక్ష్యంగా చేసుకోవడం మానుకోవాలని భాజపాకు విజ్ఞప్తి చేశారు. ‘‘పోలీసులను ఉపయోగించుకొని ఆటోడ్రైవర్లపై భాజపా నకిలీ చలాన్లు విధిస్తోంది. ఐ లవ్‌యూ కేజ్రీవాల్‌ అని రాయడమే డ్రైవర్లు చేసిన తప్పు. ఇలాంటి చర్యలకు పాల్పడం సరికాదు. పేదలపై ప్రతీకార చర్యలు మానుకోండి..’’ అని ట్విటర్‌లో హితవు పలికారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని