దిల్లీ ఫైట్‌: భాజపా మేనిఫెస్టో విడుదల

తాజా వార్తలు

Updated : 01/02/2020 09:41 IST

దిల్లీ ఫైట్‌: భాజపా మేనిఫెస్టో విడుదల

దిల్లీ: త్వరలో జరగబోయే దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (భాజపా) ‘దిల్లీ సంకల్ప పత్ర’ పేరిట ఎన్నికల ప్రణాళికను శుక్రవారం విడుదల చేసింది. స్వచ్ఛమైన గాలి, నీరు దిల్లీ వాసులకు అందించడమే లక్ష్యమని మేనిఫెస్టోలో ఆ పార్టీ ప్రధానంగా పేర్కొంది. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కేంద్రమంత్రులు నితిన్‌ గడ్కరీ, ప్రకాశ్‌ జావడేకర్‌, హర్షవర్ధన్‌, పార్టీ దిల్లీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మనోజ్‌ తివారీ మాట్లాడుతూ.. దిల్లీని అవినీతి రహితంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, పారదర్శక పాలన అందిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో సగం మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కళంకులని ఆరోపించారు. ఈ పద్ధతిని తాము మార్చబోతున్నామని చెప్పారు. భాజపా గెలిస్తే ఇటీవల రెగ్యులరైజ్‌ చేసిన సొసైటీల కోసం డెవలప్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్క ఇంటికీ సురక్షితమైన నల్లా నీటిని అందజేస్తామని, వాటర్‌ ట్యాంకర్లపై ఆధారపడకుండా చేస్తామని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే కేంద్ర పథకాలైన ఆయుష్మాన్‌ యోజన, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, కిసాన్‌ సమ్మాన్‌ యోజన వంటి పథకాలను దిల్లీలోనూ అమలు చేస్తామన్నారు. పేదలకు రూ.2కే కిలో గోధుమ పిండిని అందజేస్తామన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాయాల్లో ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ.. దిల్లీలో బుల్లెట్‌ ట్రైన్‌లాంటి అభివృద్ధిని అందిస్తామని హామీ ఇచ్పేచారు. భాజపా చరిత్ర దిల్లీతో ముడిపడి ఉందని, దిల్లీ గతిని తమ పార్టీ మారుస్తుందని చెప్పారు. ఫిబ్రవరి 8న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని