ఆందోళనకారులకు ‘ఆప్‌’ బిర్యానీలు: యోగి

తాజా వార్తలు

Published : 02/02/2020 01:40 IST

ఆందోళనకారులకు ‘ఆప్‌’ బిర్యానీలు: యోగి

దిల్లీ: కశ్మీర్‌లో ఉగ్రవాదులకు మద్దతు పలుకుతున్న వారే షాహిన్‌బాగ్‌లో ఆందోళనలు, ఆజాదీ నినాదాలు చేస్తున్నారని యూపీ సీఎం, భాజపా నేత యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. తూర్పు దిల్లీలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీ తరఫున పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ఆమ్‌ఆద్మీ పార్టీపై విమర్శలు గుప్పించారు. షాహిన్‌బాగ్‌లో ఆందోళన చేస్తున్న వారికి కేజ్రీవాల్‌ ప్రభుత్వం బిర్యానీలు పంపిణీ చేస్తోందని ఆరోపించారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) నిరసిస్తూ దిల్లీలోని షాహిన్‌బాగ్‌లో నెల రోజులుగా మహిళలు, చిన్నారులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారినుద్దేశించి యోగి మాట్లాడారు. ‘‘వారి పూర్వీకులు దేశాన్ని విభజించారు. ‘ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌’గా దేశం అవతరిస్తుండడం సహించలేక  ఆందోళనలు చేస్తున్నారు. ప్రపంచ శక్తిగా భారత్‌ ఎదగడం ఇష్టం లేకే ఆందోళనలు చేస్తున్నారే తప్ప.. సీఏఏ గురించి కాదు’’ అని యోగి ఆరోపించారు. దిల్లీ అసెంబ్లీకి ఈ నెల 8న ఎన్నికలు జరగనుండగా.. 11న ఫలితాలు వెలువడనున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని