‘షాహీన్‌బాగ్‌.. ఆత్మాహుతి దళాల కేంద్రం’

తాజా వార్తలు

Published : 06/02/2020 11:56 IST

‘షాహీన్‌బాగ్‌.. ఆత్మాహుతి దళాల కేంద్రం’

కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలోని షాహీన్‌బాగ్‌లో 40 రోజులుగా కొనసాగుతున్న ధర్నాపై కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షాహీన్‌బాగ్‌ ఆత్మాహుతి దళాలను పెంపొందిస్తున్న కేంద్రంగా మారిందని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ‘ఈ షాహీన్‌బాగ్‌ ఇప్పుడు ఉద్యమం కాదు. ఆత్మాహుతి బాంబర్లను పెంచుతున్న కేంద్రం. రాజధానిలో దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు’ అని గిరిరాజ్‌ ట్వీట్‌ చేశారు. 

కేంద్రం తీసుకొచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా గతేడాది డిసెంబరు 18 నుంచి వందలాది మంది పురుషులు, మహిళలు, చిన్నారులు షాహీన్‌బాగ్‌లో ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. గత 40 రోజులుగా ఈ ధర్నా.. దిల్లీ ఎన్నికల్లో కీలక ప్రచారాస్త్రంగా మారింది. ఆప్‌, కాంగ్రెస్‌ల మద్దతుతోనే  ఆందోళనకారులు రహదారిని అడ్డగించి, ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారని... తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే శిబిరాన్ని లేపేస్తామని భాజపా నేతలు ఉద్వేగభరిత ప్రసంగాలు చేస్తున్నారు. అయితే, భాజపా ఆరోపణలను ఆప్‌ అదే స్థాయిలో తిప్పికొట్టింది. అధికారం కోసం ఆ పార్టీ మురికి రాజకీయాలు చేస్తోందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ దుయ్యబట్టారు. మరోవైపు ఈ శిబిరానికి కాంగ్రెస్‌ పరోక్షంగా మద్దతిస్తూ ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని