కేంద్రానికి మంత్రి నిరంజన్‌ రెడ్డి లేఖ

తాజా వార్తలు

Published : 06/02/2020 18:32 IST

కేంద్రానికి మంత్రి నిరంజన్‌ రెడ్డి లేఖ

హైదరాబాద్‌: కందుల కొనుగోలు కోటాను పెంచాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 2.7లక్షల మెట్రిక్‌ టన్నుల కందుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు కందుల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి మంత్రి లేఖ రాశారు. 47.5 వేల మెట్రిక్‌ టన్నులకు అదనంగా మరో 56వేల మెట్రిక్‌ టన్నుల కందుల కొనుగోలుకు అవకాశం కల్పించాలని లేఖలో కోరారు.

అనంతరం పలు శాఖల అధికారులతో మంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. సహకార ఎన్నికల అనంతరం డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికలు అన్నీ సకాలంలో పూర్తి కావాలని అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయిల్‌ ఫామ్‌ మొక్కలు రైతులకు అందుబాటులో ఉంచి సాగు చేయాలనుకుంటున్న రైతులకు ప్రోత్సాహం అందించాలన్నారు. యూరియా పంపిణీలో జాప్యం చేయకూడదని, ప్రతివారం ఎరువుల కంపెనీలతో సమీక్షలు నిర్వహించాలని మంత్రి సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని