దిల్లీ ఫైట్‌: నా సిక్స్త్‌ సెన్స్‌ ఏంచెబుతోందంటే?

తాజా వార్తలు

Updated : 08/02/2020 14:15 IST

దిల్లీ ఫైట్‌: నా సిక్స్త్‌ సెన్స్‌ ఏంచెబుతోందంటే?

దిల్లీ ఎన్నికలపై భాజపా దిల్లీ చీఫ్‌ ఆసక్తికరవ్యాఖ్యలు

దిల్లీ: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్న వేళ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ మనోజ్‌ తివారీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు వస్తున్న సంకేతాలు, తన సిక్స్త్‌ సెన్స్‌ చెబుతున్న దాన్ని బట్టి దేశ రాజధానిలో భాజపానే అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. శనివారం తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన సారథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో భాజపా అధికారం దక్కించుకుంటుందని విశ్వాసం వ్యక్తంచేశారు. తన తల్లి ఆశీర్వాదంతో పాటు ప్రజల ఆశీస్సులు కూడా తనకు ఉన్నాయన్నారు. ఎన్నికల్లో భాజపా గెలిస్తే మీరే సీఎం అవుతారా అని విలేకర్లు ప్రశ్నంచగా.. సమాధానాన్ని ఆయన దాట వేశారు.

50కి పైగా సీట్లు మావే..

భాజపాకు 50కి పైగా స్థానాలు వస్తాయని.. ప్రజల ఆశీర్వాదంతో నరేంద్రమోదీ నాయకత్వంలో దిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మనోజ్‌ తివారీ ధీమా వ్యక్తంచేశారు. ఈ రోజు ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో శుక్రవారం దిల్లీలోని పలు ఆలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ పార్టీ గెలవాలని ప్రార్థించారు. అంతేకాకుండా నిన్న ఆయన రోడ్డుపై క్రికెట్‌ ఆడారు.

దిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ 67 స్థానాలు గెలుచుకొని భారీ విజయం అందుకుంది. అనంతరం 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ఏడుకు ఏడు స్థానాల్లో విజయదుందుభి మోగించింది. ఈ నేపథ్యంలో దిల్లీ అ సెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారోనన్న ఉత్కంఠ నెలకొంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని