కేకే ఓటుపై హైకోర్టుకు భాజపా కౌన్సిలర్లు

తాజా వార్తలు

Published : 09/02/2020 00:50 IST

కేకే ఓటుపై హైకోర్టుకు భాజపా కౌన్సిలర్లు

హైదరాబాద్‌: తెలంగాణలోని తుక్కుగూడ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఎన్నికలో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఎక్స్అఫీషియో ఓటు వేయడంపై భాజపా కౌన్సిలర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఏపీకి కేటాయించిన కేకే.. తెలంగాణలో వేసిన ఓటు చెల్లదని పేర్కొంటూ భాజపా కౌన్సిలర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర విభజనకు ముందు కేకే రాజ్యసభకు ఎన్నికయ్యారని, అయితే ఆయన ఏపీ కోటా కింద ఎన్నికైనట్లు 2014లో ప్రకటించారని పిటిషన్‌లో కౌన్సిలర్లు పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహన్రావు ఎక్స్ అఫీషియో ఓటుతో భాజపా సభ్యులు ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యే పరిస్థితులు ఉన్న సందర్భంలో కేకే ఓటు వేసేందుకు మున్సిపల్ కమిషనర్ అనుమతించారని ఆరోపించారు. తెరాస ఒత్తిడితో ఎన్నికల అధికారి చట్ట విరుద్ధంగా వ్యవహరించారన్నారు. కేకేతో పాటుగా రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, మున్సిపల్ ఎన్నికల అధికారి రాజేశ్వర్ రెడ్డి, తుక్కుగూడ మున్సిపాలిటీ ఛైర్మన్ మధుమోహన్, వైస్ ఛైర్మన్ వెంకటరెడ్డిని పిటిషన్‌లో ప్రతివాదులుగా పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని