ప్రలోభాలకు గురైతే పరిస్థితి ఇంతే: పవన్‌
close

తాజా వార్తలు

Updated : 13/02/2020 18:58 IST

ప్రలోభాలకు గురైతే పరిస్థితి ఇంతే: పవన్‌

కర్నూలు: కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ రెండో రోజుపర్యటన కొనసాగుతోంది. గురవారం ఉదయం జోహరాపురం వంతెన సమస్యపై స్థానికులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రలోభాలకు గురై ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే ఇలాంటి ఇబ్బందులే వస్తాయని వ్యాఖ్యానించారు. చిన్న వంతెన కూడా నిర్మించలేకపోతే ఎన్నికల్లో గెలిచి ఏం ప్రయోజనమని అసహనం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల మధ్య గొడవ కారణంగా వంతెన నిర్మాణం ఆగిపోవడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ముందు ప్రజలు కూడా బాగా ఆలోచించుకోవాలని సూచించారు. ఇలాంటి రాజకీయ వ్యవస్థ మనకు అవసరమా? అని ప్రశ్నించారు. మూడు రాజధానుల సంగతి తర్వాత.. జోహరాపురం బ్రిడ్జి వంతెన వంటి చిన్న సమస్యలను పరిష్కరిచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఎమ్మిగనూరులో చేనేత కార్మికుల సమస్యలు పవన్‌ తెలుసుకోనున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని