రేపు సాయంత్రం తెలంగాణ కేబినెట్‌ భేటీ

తాజా వార్తలు

Published : 15/02/2020 13:06 IST

రేపు సాయంత్రం తెలంగాణ కేబినెట్‌ భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సాయంత్రం 4గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం కానుంది. ఈమేరకు సమావేశానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను సీఎం ఆదేశించారు.  బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై భేటీలో చర్చించి తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. వచ్చేనెల మొదటి వారంలో బడ్జెట్‌ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. కొత్త రెవెన్యూ చట్టం అంశం కూడా మంత్రివర్గ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.

రాష్ట్రంలోని నీటి పారుదల వ్యవస్థను 11 సర్కిళ్లుగా పునర్‌వ్యవస్థీకరించాలని కాళేశ్వరం పర్యటన సందర్భంగా సీఎం ఆదేశించారు. అందుకు అనుగుణంగా మంత్రివర్గంలో నిర్ణయాలు తీసుకోవచ్చని సమాచారం. విద్య, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడే వారి కోసం ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం  ఇప్పటికే నిర్ణయించింది. దీనిపై కూడా చర్చ జరిగే అవకాశముంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని