రాహుల్‌.. ట్వీట్ చేసే ముందు చెక్‌ చేసుకోండి: స్మృతీ ఇరానీ

తాజా వార్తలు

Published : 18/02/2020 13:57 IST

రాహుల్‌.. ట్వీట్ చేసే ముందు చెక్‌ చేసుకోండి: స్మృతీ ఇరానీ

దిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర విమర్శలు చేశారు. సైనిక దళాల్లో మహిళా అధికారులందరికీ మూడు నెలల్లోగా శాశ్వత కమిషన్ మంజూరు చేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ ‘‘కేంద్ర ప్రభుత్వం పురుషుల కంటే మహిళలను తక్కువ చేస్తూ వారిని కించపరుస్తోంది. అందుకే సైన్యంలో మహిళా అధికారులకు కమాండ్ హోదా, పర్మినెంట్ సర్వీస్‌ ఇవ్వకూడదని సుప్రీంకోర్టులో వాదిస్తోంది. భాజపా ప్రభుత్వంపై వ్యతిరేకంగా పోరాడిన భారత మహిళలకు నా శుభాకాంక్షలు’’ అని ట్విటర్లో విమర్శించారు. తాజాగా రాహుల్ గాంధీ ట్వీట్‌పై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. ‘‘మీరు ఎక్కువగా సంతోషపడుతున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు భాజపా మహిళా విభాగం ఇదే విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చింది. ఆ సమయంలో కమిషన్ ఏర్పాటుకు అంగీకరించలేదు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక సైన్యంలో మహిళల కోసం ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేస్తూ వారికి న్యాయం చేశారు. ట్వీట్ చేసే ముందు చెక్‌ చేసుకోమని మీ టీంకు చెప్పండి’’ అని విమర్శించారు.      

శారీరక పరిమితుల కారణంగా కమాండ్ హోదా ఇవ్వడంలేదన్న ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అది లింగ వివక్ష,  మూస ఆలోచనా ధోరణి అని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం మహిళా అధికారులు షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కింద కేవలం 10-14 ఏళ్లు మాత్రమే సైన్యంలో పని చేసే వీలు ఉంటోంది. శాశ్వత కమిషన్ ఇవ్వడంతో వారు పురుష అధికారులతో సమానంగా పదవీ విరమణ వయసు వరకూ విధుల్లో కొనసాగవచ్చు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని