డ్రోన్లతో చిత్రీకరించారనడం అవాస్తవం: సుచరిత

తాజా వార్తలు

Published : 23/02/2020 02:09 IST

డ్రోన్లతో చిత్రీకరించారనడం అవాస్తవం: సుచరిత

గుంటూరు: గత ఐదేళ్లలో తెదేపా అవినీతి బాగోతాలు బయటకు వస్తున్నాయని హోంమంత్రి సుచరిత అన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే తెదేపా నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గుంటూరులో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. రాజధానిలో మహిళలు స్నానాలు చేస్తుంటే డ్రోన్లతో చిత్రీకరించారనేది అవాస్తవమన్నారు. పోలీసుల పనితీరుపై దుష్ప్రచారం చేయడం సరికాదని హితవుపలికారు. రాజధానిలో భూములు అభివృద్ధి చేసి ఇస్తామనీ.. ఎవరికీ ఆందోళన అవసరం లేదని సుచరిత చెప్పారు. రాజధాని ఎక్కడికీ తరలిపోవడంలేదన్న ఆమె.. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ మాత్రమే జరుగుతోందని చెప్పారు. సీఎం జగన్‌ రైతుల పక్షపాతి అని, రైతులకు ఆయన అన్యాయం చేయరన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని