దిల్లీ ‘అల్లర్లు’ బెంగాల్‌లో జరగవు..
close

తాజా వార్తలు

Published : 04/03/2020 01:21 IST

దిల్లీ ‘అల్లర్లు’ బెంగాల్‌లో జరగవు..

కోల్‌కతా: దిల్లీ అల్లర్ల విషయంలో భాజపాపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శల వర్షం కురిపించారు. సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన దిల్లీ అల్లర్లకు భాజపానే బాధ్యత వహించాలని ఆమె అన్నారు. 40 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్న ఆమె.. ఆ అల్లర్లు ప్రణాళికబద్ధంగా చేసినవే అని ఆరోపించారు. దాడుల్లో మరణించిన వారి మృతదేహాలు ఇంకా బయటపడుతూనే ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒక్కసారి కూడా క్షమాపణ కోరలేదని ఆమె మండిపడ్డారు. అయితే, దిల్లీలో జరిగినట్లుగా బెంగాల్‌లో అల్లర్లు ఎప్పటికీ జరగబోవని ఆమె దీమా వ్యక్తం చేశారు. ‘మాకు దిల్లీ వద్దు. ఉత్తరప్రదేశ్‌ అసలే వద్దు. మీరు ప్రజలను, వాళ్ల ఇళ్లను తగలబెడుతున్నారు’ అని మమత ధ్వజమెత్తారు.

‘బెంగాల్‌ ప్రజలు బయపడాల్సిన పనిలేదు. మిమ్మల్ని ఎవరూ తాకలేరు. ఒకవేళ ఎవరైనా మీ ధ్రువపత్రాలు చూపించాలని మీ ఇంటికి వస్తే మాకు ఓటు హక్కు, గుర్తింపు కార్డు ఉన్నాయని వాళ్ల ముఖం మీద చెప్పేయండి’ అని ఆమె సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్‌ఆర్‌సి), నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌పిఆర్)ను బెంగాల్‌లో అమలు చేసేందుకు మమత వ్యతిరేకించిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని