ఏడుగురు కాంగ్రెస్‌ ఎంపీల సస్పెన్షన్‌

తాజా వార్తలు

Updated : 05/03/2020 18:31 IST

ఏడుగురు కాంగ్రెస్‌ ఎంపీల సస్పెన్షన్‌

దిల్లీ: లోక్‌సభలో గురువారం ఏడుగురు కాంగ్రెస్‌ ఎంపీలను స్పీకర్‌ ఓంబిర్లా సస్పెండ్‌ చేశారు. సభలో అనుచితంగా వ్యవహరిస్తున్నారన్న కారణంగా వీరిని  బడ్జెట్‌ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్‌ చేస్తునట్టు వాయిస్‌ ఓట్ ద్వారా తీర్మానం చేశారు. సస్పెండ్‌ గురైన ఎంపీలలో గౌరవ్‌గొగొయ్‌, ఇబే హిందోన్‌, రాజ్‌ మోహన్‌ ఉన్నిధాన్‌, గుర్జిత్‌ సింగ్ అజ్లా, టీఎన్‌ ప్రతాపన్‌, దీన్‌ కురియకోస్‌, మాణిక్య ఠాగూర్‌లు ఉన్నారు. రెండురోజుల క్రితం మార్చి11న దిల్లీ అల్లర్లపై చర్చ జరుపుతామని స్పీకర్‌ ప్రకటించిన నేపధ్యంలో ఈ రోజే చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలోనే హౌస్‌లో పేపర్లను చింపి స్పీకర్‌ స్థానం వైపునకు ఉద్దేశపూర్వకంగా వేశారన్న కారణంగా వీరిని సస్పెండ్‌ చేసినట్టు స్పీకర్‌ తెలిపారు. ఈ పరిణామంపై కాంగ్రెస్‌పార్టీ లోక్‌సభ లీడర్‌ అధిర్‌రంజన్‌ చౌథరీ స్పందిస్తూ..ఇది స్పీకర్‌ తీసుకున్న నిర్ణయం కాదని ప్రభుత్వం కక్షపూరితధోరణితో తీసుకున్న నిర్ణయమంటూ మండిపడ్డారు. ఈ సస్పెన్షన్‌ తాము ఒప్పుకోబోమన్నారు. పార్లమెంటు లోపల, బయట ప్రభుత్వధోరణికి వ్యతిరేకంగా పోరాడతామని తెలిపారు. కాగా సోమవారం ప్రారంభమైన ఈ రెండోవిడత బడ్జెట్‌ సమావేశాలు ఏప్రిల్‌ 3న ముగియనున్నాయి.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని