న్యాయపోరాటం చేస్తా: అశోక్‌గజపతిరాజు

తాజా వార్తలు

Updated : 07/03/2020 14:15 IST

న్యాయపోరాటం చేస్తా: అశోక్‌గజపతిరాజు

విజయనగరం: మాన్సాస్‌ ట్రస్ట్‌ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు సరికాదని కేంద్ర మాజీ మత్రి, తెదేపా సీనియర్‌ నేత అశోక్‌గజపతిరాజు అన్నారు. శనివారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...సింహాచలం దేవస్థానం పరిధిలో 105 ఆలయాలు, విలువైన భూములు ఉన్నాయని, దేవస్థానం భూములపై కొందరు కన్నేశారని ఆరోపించారు. దాతలు ఇచ్చిన భూములు ఆలయానికే చెందాలని స్పష్టం చేశారు. ట్రస్టుకు రాజకీయాలతో సంబంధం లేదని, ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌గా వేరే మతం వారిని నియమిస్తే సమస్యలు వస్తాయన్నారు. పిల్లలకు భవిష్యత్‌ను ఇవ్వడానికే ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. సంచైత ఆధార్‌కార్డు పరిశీలిస్తే ఆమె ఎక్కడ నివసిస్తున్నారో అందరికీ తెలుస్తుందన్నారు.

ప్రభుత్వ తీరుతో భవిష్యత్‌ తరాలకు నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రస్టు విషయంలో ప్రభుత్వం తీరు వింతగా ఉందన్నారు. ప్రభుత్వ తీరుతో పరిశ్రమలు, పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయన్నారు. నోటీసులు ఇవ్వకుండానే నిర్ణయం తీసుకున్నారు.. రాత్రికి రాత్రే దొంగతనంగా జీవో ఇచ్చారని ఆరోపించారు. ఇప్పటి వరకు జీవోను బయటపెట్టలేదని, రహస్యంగా జీవో ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అందరి సహకారంతో ప్రభుత్వ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తామని అశోక్‌గజపతిరాజు స్పష్టం చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని