కాంగ్రెస్‌ నేతలకు తలసాని సవాల్‌

తాజా వార్తలు

Published : 08/03/2020 01:11 IST

కాంగ్రెస్‌ నేతలకు తలసాని సవాల్‌

హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌ ఫాంహౌస్‌పై కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మరో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. 111 జీవో ఉల్లంఘించారంటూ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తలేనని చెప్పారు. జీవోను ఎవరు ఉల్లంఘించారో చర్చకు తాను సిద్ధమనీ.. కాంగ్రెస్‌ నేతలు ఇందుకు సిద్ధమా?అని సవాల్‌ విసిరారు. మంత్రి కేటీఆర్‌ లీజుకు తీసుకున్నాక ఫాంహౌస్‌లో ఎలాంటి నిర్మాణాలూ జరగలేదన్నారు. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి డ్రోన్‌ కెమెరాతో దృశ్యాలు తీయడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగమేనన్నారు. జీవోను ఉల్లంఘించి కాంగ్రెస్‌ నేతలు నిర్మాణాలు చేసింది వాస్తవం కాదా? అని తలసాని ప్రశ్నించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని