హామీలకూ బడ్జెట్‌కు పొంతన లేదు: లక్ష్మణ్‌

తాజా వార్తలు

Published : 10/03/2020 02:09 IST

హామీలకూ బడ్జెట్‌కు పొంతన లేదు: లక్ష్మణ్‌

హైదరాబాద్‌: ఎన్నికల సమయంలో తెరాస ఇచ్చిన హామీలకు.. ఇప్పడు ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు పొంతన లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓట్లు దండుకోవడం తప్ప ప్రభుత్వానికి ప్రజల బాగోగులు పట్టట్లేదని విమర్శించారు. పేదలకు రెండు పడక గదులు ఇళ్లు అటకెక్కాయని ఆరోపించారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం నిధులు తగ్గించిందని, ఏళ్ల తరబడి ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదని లక్ష్మణ్‌ అన్నారు. సిబ్బంది లేక ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. తెరాస హయాంలో అప్పులు విపరీతంగా పెరిగిపోయాయని లక్ష్మణ్‌ చెప్పారు. 2014లో తెలంగాణకు రూ.70వేల కోట్లు అప్పులు ఉండేవని, ప్రస్తుతం అవి రూ.2.30 లక్షల కోట్లకు చేరాయని లక్ష్మణ్‌ చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని