మద్యంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

తాజా వార్తలు

Updated : 09/03/2020 20:18 IST

మద్యంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిరోజుల పాటు మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రకటించారు. ఈనెల 12 నుంచి 29 వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు తెలిపారు. ఆయా రోజుల్లో దుకాణాలకు మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు అనిల్‌ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటర్లపై డబ్బు, మద్యం ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈనెల 21 నుంచి పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. 21న ఎంపీటీసీ స్థానాలకు, 23న మున్సిపల్‌, నగర పంచాయతీ, కార్పొరేషన్లకు ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఈనెల 27, 29 తేదీల్లో రెండు దశల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని