ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదు: బుగ్గన

తాజా వార్తలు

Published : 14/03/2020 00:40 IST

ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదు: బుగ్గన

దిల్లీ: రాష్ట్రానికి అవసరమైన ఆర్థికసాయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించినట్లు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. దిల్లీలో నిర్మలాసీతారామన్‌తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థలకు సుమారు రూ.5వేల కోట్ల నిధులు రావాల్సి ఉందని.. వాటిని వెంటనే విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. కేంద్రం నుంచి గ్రాంటు రాకపోవడంతో రాష్ట్ర ఖజానాపై ప్రభావం పడిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసే విధంగా వైకాపా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.3వేల కోట్లు రీయింబర్స్‌ కావాల్సి ఉందని.. ఆ నిధులు త్వరితగతిన విడుదల చేయాలని నిర్మలా సీతారామన్‌ను కోరినట్లు బుగ్గన వివరించారు. మరోవైపు జిల్లాల్లో వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను కోరామని తెలిపారు. వ్యవసాయం, నీటిపారుదల, తాగునీరు అంశాలపై నీతిఆయోగ్‌ నిపుణులతో చర్చించామన్నారు. ఆర్థికమాంద్యం ప్రభావం రాష్ట్రంపైనా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. గత ప్రభుత్వం చేసిన అప్పులు చెల్లించడానికి మరో మూడేళ్లు పడుతుందని చెప్పారు. స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల చిన్న ఘర్షణలు సహజమని ఆయన వ్యాఖ్యానించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని