పోటీ నుంచి అందుకే తప్పుకొంటున్నారు: బొత్స

తాజా వార్తలు

Published : 15/03/2020 01:35 IST

పోటీ నుంచి అందుకే తప్పుకొంటున్నారు: బొత్స

అమరావతి: రాష్ట్రంలో చెదురుమదురు ఘటనలు తప్ప ఎక్కడా చెప్పుకోదగ్గ ఘటనలు జరగలేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అభ్యర్థుల మధ్య విభేదాల వల్లే చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయన్న ఆయన.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. ఇందుకు పెద్ద ఎత్తున దాఖలైన నామినేషన్లే తార్కారణమని పేర్కొన్నారు. మాచర్ల దాడి ఘటనకు తెదేపా నేతల చర్యలే కారణమని విమర్శించారు. ఈ దాడి ఘటనలో ఇద్దరిపై నాన్‌బెయిలబుల్ కేసు పెట్టినట్టు తెలిపారు. సున్నిత ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తమ పార్టీ విధానాలు నచ్చి కొందరు పోటీ నుంచి తప్పుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం నేటితో ముగిసింది. అనేక చోట్ల అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకోవడంతో అధికార పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు. కొన్నిచోట్ల అధికార పార్టీ తీరును నిరసిస్తూ ఈ ఎన్నికలను విపక్ష పార్టీలు బహిష్కరించాయి. కడప జడ్పీ పీఠాన్ని వైకాపా కైవసం చేసుకోనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని