ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామా ఆమోదం

తాజా వార్తలు

Published : 14/03/2020 21:39 IST

ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామా ఆమోదం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో శనివారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరుగురు కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలను మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ నర్మద ప్రసాద్‌ ప్రజాపతి ఆమోదించారు. ఇమర్తి దేవీ, తులసీ సిలావత్‌, ప్రద్యుమ్నన్‌ సింగ్‌ తోమర్‌, మహేంద్ర సింగ్‌ సిసోడియా, గోవింద్‌ సింగ్‌ రాజ్‌పూత్‌, ప్రభురామ్‌ చౌదరీల రాజీనామాలు ఆమోదం తెలిపారు. అంతకుముందే వారిని రాష్ట్ర కేబినెట్‌ నుంచి తొలగించడం గమనార్హం. అదేవిధంగా మార్చి 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతాయని స్పీకర్‌ ప్రజాపతి వెల్లడించారు. అసెంబ్లీకి వచ్చే వారందరికీ మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మరోవైపు బెంగళూరులో ఉన్న ఎమ్మెల్యేలందరూ క్షేమంగా బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం కమల్‌నాథ్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు.

ఇటీవల మధ్యప్రదేశ్‌కు చెందిన 19 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బెంగళూరుకు తరలిన విషయం తెలిసిందే. వారంతా కాంగ్రెస్ సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియాకు విధేయులని సమాచారం. సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన వెంటనే వారంతా తమ పదవులకు రాజీనామా చేసినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని