కేంద్రమంత్రితో ఎంపీ కోమటిరెడ్డి భేటీ

తాజా వార్తలు

Published : 16/03/2020 20:47 IST

కేంద్రమంత్రితో ఎంపీ కోమటిరెడ్డి భేటీ

దిల్లీ: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిల్లీలో భేటీ అయ్యారు. మూసీ నదిని పరిరక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నమామి గంగ తరహాలో కార్యక్రమాలు చేపట్టాలని మంత్రిని కోరారు. కాలుష్య నియంత్రణ కోసం ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, మూసీ నది ఒడ్డున విరివిరిగా చెట్ల పెంపకాన్ని చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నదిపై అక్రమ నిర్మాణాలను తొలగించాలని.. పరిశ్రమలు మూసివేసి కాలుష్యాన్ని నివారించాలని కోరారు. మూసీ నదికి పూర్వవైభవం తెస్తే కోట్ల మందికి  ప్రయోజనం కలుగుతుందని కేంద్రమంత్రికి కోమటిరెడ్డి వివరించారు. ఈ మేరకు ఆయన వినతిపత్రం అందజేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని