దిల్లీలో తెలంగాణ భాజపా ఎంపీల మౌనదీక్ష

తాజా వార్తలు

Published : 18/03/2020 00:59 IST

దిల్లీలో తెలంగాణ భాజపా ఎంపీల మౌనదీక్ష

దిల్లీ: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడంపై భాజపా ఎంపీలు దిల్లీలో నిరసన వ్యక్తంచేశారు. కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయాన్ని నిరసిస్తూ తెలంగాణ భాజపా ఎంపీలు బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌తో పాటు స్థానిక భాజపా నేతలు మౌనదీక్ష చేపట్టారు. దిల్లీలోని తెలంగాణ భవన్‌లో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఈ దీక్ష చేపట్టారు. సీఏఏకు వ్యతిరేకంగా చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. సీఏఏ అనేది పౌరసత్వం ఇచ్చేదే తప్ప ఉన్న పౌరసత్వాన్ని తొలగించేది కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. సీఎం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని