కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు కన్నా లేఖ

తాజా వార్తలు

Published : 19/03/2020 01:35 IST

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు కన్నా లేఖ

అమరావతి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. రాష్ట్ర ఎన్నికల సంఘంపై అధికార పార్టీ నేతల మాటల దాడిని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలు పంపాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘంపై అధికార పార్టీ నేతల మాటల దాడిని కన్నా ప్రస్తావించారు. మరోవైపు వైకాపా నేతల హింస, దౌర్జన్యాల పాల్పడడ్డారని లేఖలో ఆయన పేర్కొన్నారు.

‘1956 నుంచి జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ ఇలాంటి దౌర్జన్యాలు జరగలేదు. అప్రజాస్వామిక విధానాలతో 25శాతం ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం చేసుకున్నారు. కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరు వారాలు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి, స్పీకర్‌తో పాటు మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు ఎన్నికల కమిషనర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అభ్యంతరకరమైన, అసభ్య పదజాలంతో ఎస్‌ఈసీని దూషించారు. ఎన్నికల కమిషనర్‌కు అత్యున్నత స్థాయి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర పోలీసు వ్యవస్థ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారింది’ అని లేఖలో అమిత్‌షాకు కన్నా వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని