కమల్‌నాథ్‌ సర్కార్‌కు నేడే బలపరీక్ష..!

తాజా వార్తలు

Updated : 20/03/2020 00:53 IST

కమల్‌నాథ్‌ సర్కార్‌కు నేడే బలపరీక్ష..!

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో బలపరీక్షకు రంగం సిద్ధమైంది.  అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే శుక్రవారం సాయంత్రం 5గంటలలోపు కమల్‌నాథ్‌ బలపరీక్షలో నెగ్గాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా.. కరోనా వైరస్‌ ప్రభావంతో అసెంబ్లీ సమావేశాలను మార్చి 26కు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, బలపరీక్ష కోసం అత్యవసర సమావేశం నిర్వహించాలని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం స్పీకర్‌ను కోరింది. అధికార కాంగ్రెస్‌ నుంచి 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. మరోవైపు తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెంటనే బలపరీక్ష నిర్వహించాలంటూ భాజపా నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గురువారం సర్వోన్నత న్యాయస్థానం కమల్‌నాథ్‌ సర్కారుకు ఈ ఆదేశాలు జారీ చేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని