ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలి:సోనియా

తాజా వార్తలు

Published : 03/04/2020 00:59 IST

ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలి:సోనియా

దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ మంచి పరిణామమేనని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. అయితే ప్రణాళికాబద్ధంగా చేయకపోవడంతోనే ప్రజలకు ఇబ్బందులు తలెత్తాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) గురువారం సమావేశమైంది. కరోనా వైరస్‌ ప్రభావం, తాజా పరిస్థితులపై ఈ సమావేశంలో నేతలు చర్చించారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడారు. వలస కార్మికులు వందల కి.మీ.ల మేర నడవాల్సి రావడంపై ఆవేదన కలిగించిందన్నారు. కరోనా నివారణ కోసం ప్రభుత్వం చర్యలను సమర్థిస్తున్నామని.. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. బ్యాంకుల ద్వారా మధ్యతరగతి వారికి కొంత ఉపశమనం లభించిందని సోనియా అభిప్రాయపడ్డారు. బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీ రుణంపైనా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. వైద్య సిబ్బందికి కిట్‌లు, మాస్క్‌లు అందుబాటులో ఉంచాలన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు స్వీయ నిర్బంధంలో ఉండటమే మందు అని.. మరో ప్రత్యామ్నాయం లేదని చెప్పారు. వైరస్‌కు కులం, మతం, ప్రాంతంతో సంబంధంలేదని.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. కాంగ్రెస్‌ శ్రేణులంతా అవసరమైన వారికి ఆహారం, నీరు అందించాలి సోనియా పిలుపునిచ్చారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని