కేంద్రం ముందే గుర్తించాల్సింది: చాడ

తాజా వార్తలు

Published : 03/04/2020 01:00 IST

కేంద్రం ముందే గుర్తించాల్సింది: చాడ

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ మహమ్మారిపై పోరుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరినీ భాగస్వాములను చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నిజాముద్దీన్‌లోని తబ్లీగీ జమాత్‌కు వెళ్లి వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం కోసం ముస్లిం మత పెద్దల సాయం తీసుకోవాలని సూచించారు. ఓ మతానికి చెందిన వారి వల్లే దేశంలో కరోనా ప్రబలినట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు. గత నెల 13న ప్రధాని మోదీ మన దేశంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగలేదని చెప్పారని గుర్తు చేశారు. కరోనా తీవ్రతను కేంద్రం ముందే గుర్తించి ఉంటే ఈ సమస్య ఉత్పన్నం అయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా కరోనాపై జరిగే యుద్ధంలో అందరూ కలిసికట్టుగా పోరాడి గెలవాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని