అప్పుల ఊబిలోకి ఏపీ: అచ్చెన్న

తాజా వార్తలు

Published : 11/04/2020 00:26 IST

అప్పుల ఊబిలోకి ఏపీ: అచ్చెన్న

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. అధికారం చేపట్టిన ఏడాదిలోనే రూ.77 వేల కోట్లు అప్పు చేసి ప్రజల్ని నిండా ముంచిన ముఖ్యమంత్రిగా జగన్‌ చరిత్రలో మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. జగన్‌ సర్కార్‌ వచ్చాక ఏపీ ప్రజల భవిష్యత్తు, రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణాలు ఆగిపోయాయని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలను ఎత్తివేసి.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను సగానికి కోసి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంట్రాక్టర్లపై జగన్‌ చూపిస్తున్న ప్రేమ రాష్ట్ర ప్రజలపై చూపాలని హితవు పలికారు. కరోనా దెబ్బకు సామాన్య ప్రజలు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో దిల్లీ ప్రభుత్వం తరహాలో పేదలకు రూ.5 వేల నగదు ఇచ్చి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన కోరారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని