వైద్య కళాశాలల కోసం స్థలాలు ఎంపిక చేయండి

తాజా వార్తలు

Published : 19/04/2020 00:35 IST

వైద్య కళాశాలల కోసం స్థలాలు ఎంపిక చేయండి

 సీఎం జగన్‌ ఆదేశం

అమరావతి: రాష్ట్రంలో వైద్య కళాశాలల నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశించారు. నాడు-నేడు కింద చేపట్టే పనులకు జూన్‌ మొదటి వారంలో టెండర్లకు వెళ్లాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ‘నాడు- నేడు’ కార్యక్రమాలపై సీఎం జగన్‌ ఇవాళ సమీక్ష నిర్వహించారు. అంతేకాకుండా కొత్త వైద్య కళాశాలల నిర్మాణంపైనా సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యరంగంలో అభివృద్ధి పనులు, కొత్త నిర్మాణాలకు రూ.16 వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ‘‘ మనం చేపట్టే పనులు ఇప్పటివారికే కాదు, భవిష్యత్‌ తరాలకూ సంబంధించినవి.వీటి వల్ల ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ఎలాంటి సమస్యలు వచ్చినా.. ప్రజలను రక్షించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి’’ అని సీఎం అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని