కష్టకాలంలోనూ రాజప్రాసాదం వీడరా?‌:అచ్చెన్న

తాజా వార్తలు

Published : 21/04/2020 15:18 IST

కష్టకాలంలోనూ రాజప్రాసాదం వీడరా?‌:అచ్చెన్న

అమరావతి: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో నివారణ చర్యలతోపాటు ప్రజల్ని కాపాడుకోవడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్షేత్రస్థాయిలో పని చేస్తుంటే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రం రాజప్రాసాదం వీడటంలేదని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 65ఏళ్ల వయసున్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, 65ఏళ్లు ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, 63ఏళ్లు ఉన్న గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ కరోనా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. 

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌ క్షేత్రస్థాయిలో తిరుగుతూ రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకుని పరిష్కరిస్తున్నారని అచ్చెన్నాయుడు చెప్పారు. మరోవైపు మేఘాలయ ముఖ్యమంత్రి కోనార్డ్‌ సంగ్మా క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలకు సహాయం అందిస్తున్నారన్నారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, 77ఏళ్ల వయసున్న కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప క్షేత్రస్థాయిలో పనిచేస్తూ కరోనాపై పోరాటం చేస్తున్నారని కొనియాడారు. మరి యువ ముఖ్యమంత్రిని అని చెప్పుకునే ఏపీ సీఎం జగన్‌కు ఇలాంటి విపత్కర సమయంలో రాజకీయమే ముఖ్యమా? అని అచ్చెన్న ప్రశ్నించారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరుకు సంబంధించిన ఫొటోలను ఆయన తన ట్విటర్‌లో పోస్టు చేశారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని