పరీక్షలు మరింత వేగవంతం చేయాలి:చంద్రబాబు

తాజా వార్తలు

Published : 24/04/2020 00:14 IST

పరీక్షలు మరింత వేగవంతం చేయాలి:చంద్రబాబు

హైదరాబాద్‌: కరోనా వైరస్‌పై పోరాడుతున్న క్షేత్రస్థాయి సిబ్బందికి తక్షణమే రక్షణ పరికరాలు అందించాలని తెదేపా అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎస్‌ నీలం సాహ్నికి లేఖ రాశారు. ట్రూనాట్‌ కిట్ల సాయంతో కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాపిస్తోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.  ఇంకా 16వేల పరీక్షల ఫలితాలు పెండింగ్‌లో ఉండటం సరికాదన్నారు. రాష్ట్రంలో సరైన టెస్టింగ్‌ ల్యాబ్‌లు లేకపోవడంతోనే ఫలితాలు ఆలస్యమవుతున్నాయని.. ఇతర రాష్ట్రాల మాదిరిగా ప్రైవేట్‌ ల్యాబ్‌ల సహకారం తీసుకునే వెసులుబాటు ఉన్నా ఏపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వైద్యులు, ఆరోగ్యసిబ్బంది, పోలీస్‌, రెవెన్యూ, పారిశుద్ధ్య కార్మికులకు ఇంతవరకూ రక్షణ పరికరాలు అందజేయకపోవడం దురదృష్టకరమన్నారు. నాణ్యతలేని పరికరాలు అందజేయడం వల్ల వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని చంద్రబాబు విమర్శించారు. క్షేత్రస్థాయిలో పోరాడుతున్న వారిపట్ల ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సరికాదని ఆయన హితవుపలికారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని