ఒక్క పిడికిలి బిగిస్తే బిగుసుకున్నయ్‌ కోట్ల పిడికిల్లు

తాజా వార్తలు

Updated : 27/04/2020 11:57 IST

ఒక్క పిడికిలి బిగిస్తే బిగుసుకున్నయ్‌ కోట్ల పిడికిల్లు

హైదరాబాద్‌: తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ భవన్‌లో నిరాడంబరంగా జరిగాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఏర్పాటైన ఉద్యమ పార్టీ ఈ రోజు 20వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ గులాబీ శ్రేణులకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అధినేత కేసీఆర్‌ ఉద్యమ స్ఫూర్తిని, గులాబీ జెండా కీర్తిని వర్ణిస్తూ కవితాత్మకంగా పెట్టిన ట్వీట్లు ఆకట్టుకుంటున్నాయి. 

‘‘ఒక్క పిడికిలి బిగిస్తే బిగుసుకున్నయ్‌ కోట్ల పిడికిల్లు
ఒక్క గొంతు జైకొడితే జంగు సైరనయ్యింది
స్ఫూర్తి ప్రదాతా వందనం.. ఉద్యమ సూర్యుడా వందనం
20 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఉద్యమ బిడ్డలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
జై తెలంగాణ! జైజై కేసీఆర్‌’’
అని పేర్కొన్నారు.  

అలాగే జెండా గురించి వర్ణిస్తూ..
‘‘తెలంగాణకు గుండె బలాన్నిచ్చిన జెండా 
గుండె గుండెను ఒకటి చేసిన జెండా
ఉద్యమానికి ఊపిరి పోసిన జెండా పేదవాడి ఆకలి తీర్చిన జెండా
రైతన్నకు భరోసా ఇచ్చిన జెండా
తెలంగాణ ప్రజలకు అండా దండా మన గులాబీ జెండా
మన గులాబీ జెండా పుట్టిన రోజు పండగ, ప్రతి గులాబీ సైనికుడికి
జై తెలంగాణ’’
అంటూ ఆయన వర్ణించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని