5న తెలంగాణ కేబినెట్‌ కీలక భేటీ

తాజా వార్తలు

Published : 01/05/2020 01:24 IST

5న తెలంగాణ కేబినెట్‌ కీలక భేటీ

హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి నివారణ, లాక్‌డౌన్‌ పరిస్థితులపై చర్చించేందుకు ఈనెల 5న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఈ కీలక భేటీ జరగనుంది. కేంద్ర ప్రభుత్వం 3 వరకు, రాష్ట్ర ప్రభుత్వం 7 వరకు లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో 7తో లాక్‌డౌన్‌ ముగియనున్న నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణ ఎలా ఉండాలి.. ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు రూపొందించాలనే అంశంపై కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై ఆసక్తి నెలకొంది. కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేసే అవకాశముంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని