అర్థంలేని విమర్శలు మానుకోవాలి:నిరంజన్‌రెడ్డి

తాజా వార్తలు

Updated : 16/05/2020 02:06 IST

అర్థంలేని విమర్శలు మానుకోవాలి:నిరంజన్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌: పోతిరెడ్డిపాడు విషయంలో రాజకీయ విమర్శలకు పోకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ హితవుపలికారు. తెరాసపై విమర్శలు చేస్తున్న రెండు జాతీయ పార్టీలు.. వారి అధిష్ఠానాలు, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పోతిరెడ్డిపాడును అడ్డుకునే ప్రయత్నం చేయాలని.. లేదంటే అర్థంలేని విమర్శలు మానుకోవాలన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో వారు మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు కేసులు వేసిందెవరని ఆయన నిలదీశారు. స్వరాష్ట్రంలో ప్రాజెక్టులపై కేసులు వేసిన ప్రతిపక్ష నేతలు ఏపీ అక్రమ ప్రాజెక్టులపై ఒక్క కేసైనా వేశారా? అని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడును అడ్డుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పూర్తి విశ్వాసం ఉందని ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు.

శ్రీశైలం నుంచి రోజూ మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని చేపట్టడాన్ని ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకుంటామని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నప్పుడు అన్ని పార్టీలు ఏకం కావాలని.. ఈ విషయంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. రాజకీయ విమర్శలతో ఒరిగేదేమీ లేదని.. ఎట్టిపరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం చేపట్టనున్న ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుని తీరుతామని మంత్రి వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి..  ఎత్తిపోతల పథకం జీవోపై ఆరా


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని