మోదీజీ.. జోక్యం చేసుకోండి: మమత

తాజా వార్తలు

Published : 28/05/2020 02:23 IST

మోదీజీ.. జోక్యం చేసుకోండి: మమత

రాష్ట్రానికి శ్రామిక్‌ రైళ్లు నడపడంపై అభ్యంతరం

కోల్‌కతా: అంపన్‌ తుపాను సృష్టించిన బీభత్సం నుంచి కోలుకోని పశ్చిమ్‌ బెంగాల్‌కు పెద్ద సంఖ్యలో శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు నడపడం పట్ల పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇలాంటి విషయంలో రాజకీయాలు తగవన్నారు. ఈ వ్యవహారంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని కోరారు.

అంపన్‌ తుపాను కారణంగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయని మమత అన్నారు. పరిమిత సంఖ్యలో రైళ్లు పంపినప్పుడు మాత్రమే వారికి సదుపాయలు కల్పించగలమని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద సంఖ్యలో రైళ్లను పంపితే కార్మికులకు సదుపాయాలు కల్పించలేమని చెప్పారు. పైగా దీనివల్ల ప్రజారోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. అటు తుపాను, ఇటు కొవిడ్‌-19తో సతమతమవుతున్న వేళ రైల్వేశాఖ మాకు ఎలాంటి సమాచారమూ ఇవ్వకుండా రైళ్లను నడుపుతోందని ఆరోపించారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు తగవన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా జోక్యం చేసుకోవాలని మమత కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని