రాష్ట్రంలో పరిస్థితి భయానకం: యనమల

తాజా వార్తలు

Updated : 28/05/2020 11:02 IST

రాష్ట్రంలో పరిస్థితి భయానకం: యనమల

అమరావతి: ఎన్టీఆర్‌ జయంతిని మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద  తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ సీనియర్‌ నేతలు యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప, అయ్యన్నపాత్రుడు, నారా లోకేశ్‌ తదితరులు నివాళులర్పించారు. అనంతరం యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రస్తుతం భయానక పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కోర్టు ఆదేశాలను లెక్కచేయనన్న రీతిలో జగన్‌ వ్యవహారశైలి ఉందని ఆక్షేపించారు. రాజ్యాంగం, కోర్టులపై గౌరవం లేకుండా జగన్‌ నిర్ణయాలు ఉన్నాయని యనమల విమర్శించారు. పథకాల రూపంలో నిధులిస్తూ వసూళ్ల రూపంలో వెనక్కి లాగేసుకుంటున్నారని ఆరోపించారు.

 మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... రాజకీయాల్లో ఎదిగామంటే అది ఎన్టీఆర్‌ పెట్టిన భిక్ష అని పేర్కొన్నారు. పసుపు జెండా రెపరెపలాడేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. జగన్‌ పరిపాలన ఇలానే కొనసాగితే రాబోయే తరాలకు తీరని నష్టం జరుగుతుందన్నారు. మాజీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ... న్యాయస్థానాలు అంటే జగన్‌కు లెక్కలేదన్నారు. కేసుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించాలని డీజీపీని ఆదేశించడం దుర్మార్గమన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని