ఈ తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది: పవన్‌
close

తాజా వార్తలు

Published : 30/05/2020 02:57 IST

ఈ తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది: పవన్‌

అమరావతి: ఆంధప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తిరిగి నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మార్పు వ్యవహారంపై హైకోర్టు తీర్పు వెల్లడించిన తర్వాత ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఈ తీర్పు ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం ఇనుమడింపజేసిందని వ్యాఖ్యానించారు.


ప్రజాస్వామ్యం గెలిచింది: కేశినేని నాని

నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తిరిగి ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో.. ప్రజాస్వామ్యం గెలిచిందని తెదేపా ఎంపీ కేశినేని ట్విటర్‌ లో పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకం నిలబడిందన్నారు.


హైకోర్టు తీర్పు హర్షణీయం: రామకృష్ణ

హైకోర్టు తీర్పుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఎస్‌ఈసీ తొలగింపు అంశంపై ప్రభుత్వ జీవోలను కొట్టివేయడం శుభపరిణామమన్నారు. నామినేషన్ల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ తిరిగి మొదలుపెట్టాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని