ఏం చేయలేదు.. తీపికబురు చెప్తారంటా: ఉత్తమ్‌
close

తాజా వార్తలు

Published : 31/05/2020 00:48 IST

ఏం చేయలేదు.. తీపికబురు చెప్తారంటా: ఉత్తమ్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందని.. స్థానిక సంస్థలను తెరాస ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా స్థానిక సంస్థల కాంగ్రెస్‌ శ్రేణులతో ఉత్తమ్‌ మాట్లాడారు. ప్రభుత్వం స్థానిక సంస్థలను పట్టించుకోవడం లేదని.. అవసరమైన మేరకు నిధులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ సంపాదనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను కేసీఆర్‌ కొంటున్నారని ధ్వజమెత్తారు. రైతుబంధు ఇవ్వడం లేదు.. రుణ మాఫీ చేయడం లేదు.. ఇవేమీ చేయకుండా రైతులకు త్వరలోనే తీపికబురు చెబుతానని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు.

‘‘కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టిన ప్రాజెక్టులతోనే తెలంగాణలో పంటల సాగు జరుగుతోంది. సీఎం కేసీఆర్‌ కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో అదనంగా ఒక్క ఎకరానికైనా నీరు అందిందా?ఎస్సారెస్పీ కింద పండిన పంటలనే కాళేశ్వరం కింద చూపిస్తున్నారు. ఎస్సారెస్పీ నుంచే 20 టీఎంసీల నీరు సముద్రం పాలైంది’’ అని ఉత్తమ్‌ వివరించారు. కాంగ్రెస్‌ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కమిటీలను నియమించుకొని ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని