దశాబ్దాల కోరిక నెరవేరిన రోజు: పవన్‌
close

తాజా వార్తలు

Published : 03/06/2020 02:02 IST

దశాబ్దాల కోరిక నెరవేరిన రోజు: పవన్‌

హైదరాబాద్‌: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈరోజు చారిత్రాత్మకమైనది. కోట్లాది మంది కల సాకరమైన రోజు. దశాబ్దాల కోరిక నెరవేరిన రోజు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ జన్మించిన రోజు. వేలాది మంది బలిదానాలు, కోట్లాది మంది త్యాగాల ఫలం మన తెలంగాణ. తెలంగాణ సాధనలో ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు అంజలి ఘటిస్తున్నా. ఈ మహత్కార్యం సాకారం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ జేజేలు పలుకుతున్నాను’’ అని పవన్‌ తన ట్విటర్‌ ఖతాలో పేర్కొన్నారు.

అభివృద్ధి ఫలాలు అందరికీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలను నడిపే నేతలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పక్షాలపై ఉందన్నారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దినదిన ప్రవర్థమానం అవ్వాలని, తిరుగులేని శక్తిగా నిలవాలని కోరుకుంటున్నట్టు పవన్‌ తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని