ఆ ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది: భట్టి

తాజా వార్తలు

Updated : 04/06/2020 10:58 IST

ఆ ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది: భట్టి

ఖమ్మం: ఎన్నో ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలతో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఏ ఒక్క లక్ష్యమూ నెరవేర్చలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం పేరిట ఏర్పడ్డ తెలంగాణలో తెరాస ప్రభుత్వం నియంతృత్వ విధానాలతో ముందుకెళ్తోందే తప్ప ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయడం లేదని విమర్శించారు. మిగులు బడ్జెట్‌తో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని ఇస్తే.. ఆరేళ్లలోనే అప్పుల మయం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పాలేరు జలాశయం వద్ద జల దీక్షకు కాంగ్రెస్‌ శ్రేణులు సిద్ధమవ్వగా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో జిల్లా పార్టీ కార్యాలయంలోనే కాంగ్రెస్‌ నేతలతో కలిసి భట్టి దీక్షకు దిగారు. ముందుగా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీకి పాలాభిషేకం చేసిన భట్టి.. రాష్ట్రంలో కృష్ణానదిపై నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. సాగునీటిని కాపాడుకునేదిపోయి.. ఏపీ రాష్ట్రం పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలతో ఉన్న నీళ్లను తరలించుకుపోతుంటే తెరాస సర్కారు ఏమీ మాట్లాడటం లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తున్నారని.. సరైన సమయంలో వారే తెరాసకు తగిన బుద్ధి చెబుతారని భట్టి వ్యాఖ్యానించారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని