కరోనాపై కుట్ర చేస్తున్నది ఎవరు?: భట్టి

తాజా వార్తలు

Published : 10/06/2020 01:18 IST

కరోనాపై కుట్ర చేస్తున్నది ఎవరు?: భట్టి

హైదరాబాద్‌: కరోనా నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద  ఆయన మాట్లాడుతూ.. కరోనా బారినపడి వైద్యులు, జర్నలిస్టులు మరణిస్తున్నారన్నారు. కరోనాపై కుట్ర చేస్తున్నది ఎవరో సీఎం కేసీఆర్‌ స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ కనీస ప్యాకేజీ కూడా ప్రకటించలేదన్నారు. కేసీఆర్‌ ప్రగతిభవన్‌, ఫామ్‌హౌస్‌లో బాగానే ఉన్నారు.. పేదల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మూడు నెలల విద్యుత్‌ బిల్లులు ఒకేసారి వసూలు చేసి  పేదలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు ఏం తోస్తే అదిచేయడం అలవాటైందని విమర్శించారు. సచివాలయంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియట్లేదన్నారు. సచివాలయం ఉందో.. లేదో ప్రజలకే తెలియాలని వ్యాఖ్యానించారు. ఈనెల 11న సీఎల్పీ నేతృత్వంలో చలో సెక్రటేరియట్‌ కార్యక్రమం చేపట్టినట్టు భట్టి విక్రమార్క తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని