ఇలాగే చేస్తే ప్రజలు తిరగబడతారు: భట్టి

తాజా వార్తలు

Published : 12/06/2020 00:56 IST

ఇలాగే చేస్తే ప్రజలు తిరగబడతారు: భట్టి

హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ చలో సచివాలయం పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు ఉదయం నుంచే కాంగ్రెస్‌ నేతలను ఇళ్లకే పరిమితం చేస్తూ గృహనిర్బంధంలో ఉంచారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు, శ్రీధర్‌బాబులను ముందస్తు అరెస్టు చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి సహా అనేక మంది నేతల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. భట్టి విక్రమార్క సచివాలయానికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు రావడంతో అదుపులోకి తీసుకుని ఇంట్లోకి పంపించారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడారు.

‘‘రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతోంది. మేం సచివాలయ ముట్టడికి పిలుపునివ్వలేదు. కేవలం సీఎం కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించాం. ఈ విషయం పోలీసులకు ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా గృహనిర్బంధం చేశారు. విద్యుత్‌ బిల్లులు, నియంత్రిత వ్యవసాయ విధానం, కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సీఎంతో చర్చించేందుకే అనుమతి కోరాం. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఈ ఉదయం 10 గంటలకు ఆయనను కలిసేందుకు అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ పోలీసులు బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధంలో ఉంచారు’’ అని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసులు సమాచార లోపంతో ఇలా వ్యవహరించడం సరైంది కాదని భట్టి ఆక్షేపించారు. ఇంత అనాలోచిత పాలన ఎక్కడా చూడలేదన్నారు. తాము ప్రజల పక్షాన ఏం మాట్లాడినా పాలకులు నిర్బంధం కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని